తెలంగాణ

telangana

ETV Bharat / state

9 Medical Colleges opening Telangana 2023 : ఒకేరోజు.. 9 మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవం - 9 Medical Colleges opening Telangana 2023

9 Medical Colleges opening Telangana 2023 : తెలంగాణ ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడంతోపాటు రాష్ట్రంలోని విద్యార్థులకు వైద్యవిద్యను మరింత చేరువ చేసేందుకు వీలుగా ఈ నెల 15న మరో తొమ్మిది వైద్య కళాశాలల్లో తరగతులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభిస్తారని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. గత ఏడాది ఎనిమిది ప్రభుత్వ వైద్య కళాశాలలు అందుబాటులోకి రాగా.. ఈ ఏడాది మరో తొమ్మిది ప్రారంభమవుతున్నాయని తెలిపారు.

Total Medical Seats in Telangana
Telangana Medical Colleges

By ETV Bharat Telangana Team

Published : Sep 8, 2023, 12:57 PM IST

9 Medical Colleges opening Telangana 2023 : రాష్ట్రంలో వైద్యవిద్య చదివే విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గత ఏడాది 8 ప్రభుత్వ వైద్య కళాశాలలు అందుబాటులోకి రాగా.. ప్రస్తుతం మరో 9 కాలేజీ​లు అందుబాటులోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు(Minister Harish Rao) తెలిపారు. ఈ విద్యాసంస్థల్లో ఈ నెల 15 తేదీ నుంచి తరగతులను ముఖ్యమంత్రి కేసీఆర్​(CM KCR) ప్రారంభిస్తారని అన్నారు.

రాష్ట్రంలో నాణ్యమైన వైద్యం అందించేందుకు.. వైద్యవిద్యను మరింత చేరువ చేస్తున్నామని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ కార్యాలయంలో గురువారం వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. కొత్తగా ప్రారంభించనున్న తొమ్మిది ప్రభుత్వ వైద్య కళాశాలల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు తగిన చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

New Medical Colleges Telangana 2023 : కరీంనగర్​, భూపాలపల్లి, నిర్మల్​, వికారాబాద్​, కామారెడ్డి, ఖమ్మం, ఆసిఫాబాద్​, సిరిసిల్ల, జనగామ వైద్య కళాశాల్లో చేరే విద్యార్థులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని వసతులు ఏర్పాట్లు చేయాలని మంత్రి హరీశ్ రావు అధికారులకు సూచించారు. కాలేజీ ప్రిన్సిపాళ్లతోసమావేశం ఏర్పాటు చేసి.. విద్యార్థుల ఇబ్బందులపై ఆరా తీయాలని తెలిపారు.

Medical Reservation Seats : ఇకపై వంద శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే

'గాంధీ, ఉస్మానియా తరహాలో సిద్దిపేట ప్రభుత్వ వైద్యకళాశాల'

రాష్ట్రం ఏర్పడక ముందు సదురు ప్రాంతంలో కేవలం 5 ప్రభుత్వ కాలేజీ​లు మాత్రమే ఉన్నాయని.. ప్రస్తుతం ప్రారంభించే కళాశాలలు కలిపి మొత్తం 26కి చేరుకున్నాయని వెల్లడించారు. ఈ కొత్త విద్యాసంస్థలు ప్రారంభిస్తే.. 900 మెడికల్​ సీట్లు(Medical Seats) అందుబాటులోకి వస్తాయని వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు(2014) 5 అయిదు వైద్య కళాశాలల ద్వారా 850 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయని.. ఇప్పుడు 3,915 సీట్లు విద్యార్థులకు అందుబాటులో వచ్చాయని చెప్పారు.

Arogya Mahila Centers in Telangana 2023 : వైద్యకళాశాలలతో పాటు మరో 100 'ఆరోగ్య మహిళ(Arogya Mahila Clinics Telangana)' క్లినిక్​లను ఈ నెల 12న ప్రారంభించనున్నట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 272 ఆరోగ్య మహిళ క్లినిక్​లు ఉండగా.. కొత్తగా ప్రారంభించే వాటితో కలిపి మొత్తం 372కి చేరుతాయని అన్నారు. ఈ కేంద్రాల్లో ప్రతి మంగళవారం ప్రత్యేకంగా మహిళా వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని వెల్లడించారు. ఆ సిబ్బంది ఎనిమిది రకాల సేవలు అందిస్తారని చెప్పారు.

ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 2,78,317 మందికి స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించినట్లు హరీశ్ రావు తెలిపారు. అందులో అవసరమున్న 13673 మందికి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యసేవలు అందించామని వివరించారు. స్టాఫ్‌నర్సుల నియామకం వేగవంతం చేసి.. పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గత నెలలో 5,204 పోస్టులకు పరీక్షలు నిర్వహించగా.. వాటి ఫలితాలను త్వరగా వెల్లడించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు.

Harish Rao on Suryapet Ragging Issue : 'ర్యాగింగ్ చేశారని రుజువైతే.. కఠిన చర్యలు తప్పవు'

జులైలో 9 వైద్య కళాశాలలు ప్రారంభిస్తాం: హరీశ్​రావు

ABOUT THE AUTHOR

...view details