తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈ రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే...! - 2021 may 8th horoscopes news

ఈరోజు మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంక‌ర‌మంచి శివ‌సాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

horoscope
రాశిఫలాలు

By

Published : May 8, 2021, 4:33 AM IST

Updated : May 9, 2021, 4:15 AM IST

కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. కీలక వ్యవహారాల్లో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. సాయిచరిత్ర పారాయణ చేయడం మంచిది.

మధ్యమ ఫలితాలు ఉన్నాయి. హుషారుగా పని చేయాలి. అధికారులతో అతి చనువు వద్దు. అందరినీ సమభావంతో చూడటం వల్ల సమస్యలు తగ్గుముఖం పడతాయి. గోసేవ చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది.

మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. మీరు ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్న ఒక ముఖ్యమైన పని దాదాపుగా పూర్తి కావొస్తుంది. మహాలక్ష్మి అష్టోత్తరం చదివితే మంచిది.

అనుకూల సమయం. తోటి వారి సహకారాలు అందుతాయి. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలు పొందుతారు. ప్రయాణాలు ఫలిస్తాయి. గణపతి ఆరాధన చేస్తే మంచిది.

పట్టుదలతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. కొందరి ప్రవర్తన మీ మనసును చికాకు పరుస్తుంది. అకారణ కలహ సూచన ఉంది. ఎట్టిపరిస్థితుల్లోనూ దైవారాధన మానకండి. ఇష్టదైవ సందర్శనం శుభప్రదం.

అలసట పెరుగుతుంది. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. ఒక సంఘటన మనస్తాపాన్ని కలిగిస్తుంది. మహాలక్ష్మీ ధ్యానం శుభప్రదం.

ధర్మసిద్ధి ఉంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. మనోధైర్యంతో చేసే పనులు సిద్ధిస్తాయి. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. గురుశ్లోకం చదవాలి.

పనుల్లో ఆటంకాలు ఎదురైనా తెలివిగా పరిష్కరిస్తారు. మీ పై అధికారులతో అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. దుష్టులను దరిచేరనీయకండి. ఈశ్వర సందర్శనం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది.

శుభ ఫలితాలు ఉన్నాయి. తోటివారి సహకారం ఉంటుంది. సమయానికి ఆహారం, విశ్రాంతి తీసుకోవాలి. ఖర్చులు పెరుగుతాయి. వేంకటేశ్వర స్వామి ఆరాధన శ్రేయోదాయకం.

సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. ఆత్మీయులతో కలిసి మరువలేని మధుర క్షణాలను గడుపుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విష్ణు సహస్రనామం పఠించాలి.

ఆత్మబలంతో పోరాడి విజయం సాధిస్తారు. ధనధాన్యాభివృద్ధి కలదు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. విష్ణు సహస్రనామ స్తోత్రం చదివితే మంచిది.

సత్పలితాలు ఉన్నాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. గొప్పవారిని కలుస్తారు. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఆదిత్య హృదయం పఠించాలి.

Last Updated : May 9, 2021, 4:15 AM IST

ABOUT THE AUTHOR

...view details