తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో 858కి చేరిన కరోనా కేసులు - తెలంగాణలో కరోనా కేసులు

రాష్ట్రంలో ఇప్పటివరకు 858 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు సీఎం కేసీఆర్​ తెలిపారు. ఇవాళ కొత్తగా 18 కేసులు వచ్చినట్లు వెల్లడించారు. కరోనాతో రాష్ట్రంలో ఇప్పటివరకు 21 మంది మృతి చెందారని చెప్పారు. చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. ఒక్క కరోనా కేసు కూడా లేని జిల్లాలు రాష్ట్రంలో 4 జిల్లాలు ఉన్నాయని వెల్లడించారు. దేశంలో కరోనా బాధితుల సంఖ్య 8 రోజులకోసారి రెట్టింపు అవుతోందని చెప్పారు. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 2.44శాతంగా ఉందన్నారు. వైద్య సిబ్బందికి అవసరమయ్యే పరికరాల కొరతను అధిగమించామని పేర్కొన్నారు. పీపీఈ కిట్లు, మాస్కులు ప్రస్తుతం సరిపడా అందుబాటులో ఉన్నాయన్నారు.

858-corona-cases-in-telangana
రాష్ట్రంలో 858కి చేరిన కరోనా కేసులు

By

Published : Apr 19, 2020, 9:43 PM IST

Updated : Apr 19, 2020, 10:33 PM IST

రాష్ట్రంలో 858కి చేరిన కరోనా కేసులు
Last Updated : Apr 19, 2020, 10:33 PM IST

ABOUT THE AUTHOR

...view details