తెలంగాణ

telangana

ETV Bharat / state

పిన్నీసును మింగిన 8 నెలల చిన్నారి - 15 నిమిషాల్లో పిన్నీసును తీసేసిన వైద్యులు

పిన్నీసును మింగిన ఓ చిన్నారి ప్రాణాలు ఉస్మానియా వైద్యులు కాపాడారు. ఎండోస్కోపీ ద్వారా 15 నిమిషాల్లోనే బయటకు తీసి ఎనిమిది నెలల బాబుకు పున:ర్జన్మనిచ్చారు. వైద్యుల కృషితో చిన్నారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.

పిన్నీసును మింగిన 8 నెలల చిన్నారి

By

Published : Jul 24, 2019, 1:30 AM IST

పిన్నీసును మింగిన ఓ చిన్నారి పరిస్థితి విషమంగా మారింది. ఉస్మానియా వైద్యులు ఎండోస్కోపి ద్వారా పిన్నీసు బయటకు తీసి ప్రాణాపాయం నుంచి కాపాడారు. శంషాబాద్‌ పరిధిలోని కొండన్నగూడ గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌, అనూష దంపతుల ఎనిమిది నెలల బాబు ఆదివారం సాయంత్రం పొరపాటున పిన్నీసు మింగేశాడు. తల్లిదండ్రులు వెంటనే స్థానిక ఆసుపత్రిలో చూపించారు. అక్కడి వైద్యుల సూచనతో హైదరాబాద్‌లోని నిలోఫర్‌ ఆసుపత్రికి తరలించారు. నిలోఫర్‌లో ఎక్స్​రే తీసి పిన్నీసు జీర్ణాశయం వద్ద చిక్కుకున్నట్లు గుర్తించారు. సంబంధిత చికిత్స చేసే నిపుణులు లేకపోవడం వల్ల ఉస్మానియా గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగానికి తీసుకెళ్లాలని సూచించారు.

15 నిమిషాల్లో పిన్నీసును తీసేసిన వైద్యులు

ఉస్మానియాలో డాక్టర్‌ రమేశ్‌ ఆధ్వర్యంలోని వైద్య బృందం ఎండోస్కోపి ద్వారా 15 నిమిషాల వ్యవధిలో పిన్నీసును బయటకు తీశారు. జీర్ణాశయం దగ్గరే ఉండటం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందన్నారు. అదే చిన్నపేగుల్లోకి జారి ఉంటే శస్త్రచికిత్స చేయాల్సి వచ్చేదని డాక్టర్‌ రమేశ్‌ తెలిపారు. విజయవంతంగా చికిత్స చేసి చిన్నారి ప్రాణాలు కాపాడిన వైద్యులను ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బి. నాగేందర్‌ అభినందించారు. సోమవారం సాయంత్రానికి బాబు ఆరోగ్యం కుదుట పడటం వల్ల డిశ్చార్జి చేశారు.

ఇదీ చూడండి: జాబిలమ్మను ఎత్తుకున్న బాహుబలి..!

ABOUT THE AUTHOR

...view details