తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ 8 సింహాలు కోలుకుంటున్నాయి.. - హైదరాబాద్​ జిల్లా తాజా వార్తలు

హైదరాబాద్​లోని నెహ్రూ జూ లాజికల్ పార్కులో ఈనెల 4న కరోనా బారినపడిన ఎనిమిది ఆసియా సింహాలు వైరస్​ నుంచి కోలుకున్నాయి. ప్రస్తుతం అవి పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు జూ అధికారులు వెల్లడించారు.

Loin
Loin

By

Published : May 7, 2021, 7:11 PM IST

నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో ఇటీవల కరోనా బారినపడిన 8 సింహాలు కోలుకున్నాయి. ఈ మేరకు అధికారులు అధికారికంగా వెల్లడించారు.

గత నెల 22న సింహాలు అనారోగ్యంగా కనిపించడంతో సిబ్బంది వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెటర్నరీ వైద్యులు సింహాలను గమనించి.. శ్వాసకోస సమస్యలతో పాటు.. జలుబుతో బాధపడుతున్నట్లు గుర్తించి తగిన వైద్యం అందించారు. గత నెల 24న జూ అధికారులు ఈ విషయాన్ని సీసీఎంబీ దృష్టికి తీసుకెళ్లగా.. వారు సింహాల ముక్కుల్లోంచి శ్రావాలను సేకరించి పరీక్షలు నిర్వహించారు. పాటిజిట్​గా నిర్ధారణ అయినట్లు ఈ నెల 4న సీసీఎంబీ నుంచి జంతు ప్రదర్శనశాల అధికారులకు నివేదిక అందింది.

అప్పటికే వెటర్నరీ వైద్యులు చికిత్స ప్రారంభించడం వల్ల 8 సింహాలు క్రమంగా కోలుకున్నాయి. ప్రస్తుతం అవి పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు జూ అధికారులు తెలిపారు. సింహాలను సంరక్షించే సిబ్బంది నుంచే వాటికి వైరస్ సోకి ఉండొచ్చని సీసీఎంబీ అధికారులు నివేదికలో పేర్కొన్నారు.

ఈ క్రమంలో జంతు ప్రదర్శనశాల అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఆదేశాల మేరకు ఈ నెల 2 నుంచి జంతు ప్రదర్శనశాలను మూసివేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు జంతు ప్రదర్శనశాల మూసే ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి.. హైదరాబాద్​ జూ పార్కులో 8 సింహాలకు కొవిడ్

ABOUT THE AUTHOR

...view details