ఏపీలో కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 83,461 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 7,943 మంది కరోనా బారిన పడ్డారు. ఇప్పటివరకు 16,93,085 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. తాజాగా 19,845 మంది కొవిడ్ నుంచి కోలుకుని బయటపడ్డారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 15,28,360కి చేరింది. ప్రస్తుతం ఏపీలో 1,53,795 యాక్టివ్ కేసులున్నాయి.
AP corona cases: ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు - corona death toll in andhrapradesh
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో 83,461 శాంపిల్స్‌ను పరీక్షించగా... 7,943 మంది కరోనా బారిన పడ్డారు.
ap covid cases
గత 24 గంటల్లో కరోనాతో చిత్తూరులో అత్యధికంగా 15 మంది మృతి చెందగా, పశ్చిమగోదావరి 12, ప్రకాశం 10, అనంతపురం 9, తూర్పుగోదావరి 8, విశాఖపట్నం 8, శ్రీకాకుళం 7, కృష్ణా 6, కర్నూలు 6, విజయనగరం 6, గుంటూరు 4, నెల్లూరు 4, కడపలో ముగ్గురు మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 10,930కి చేరింది.
ఇదీ చదవండి:Bank timings: రేపటి నుంచి బ్యాంకుల టైమింగ్స్ మారాయి