ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. 24 గంటల వ్యవధిలో 7,813 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మెుత్తం కరోనా బాధితుల సంఖ్య 88,671కి చేరింది. కొత్తగా.. మరో 52 మంది మృతి చెందగా.. రాష్ట్రంలో కొవిడ్ మరణాల సంఖ్య 985కి చేరింది. రాష్ట్రంలో కొత్తగా 53,681 కరోనా పరీక్షలు చేశారు. ఇప్పటివరకు 15 లక్షల 95 వేల 674 మందికి పరీక్షలు నిర్వహించారు. ఆస్పత్రుల్లో ప్రస్తుతం.. 44 431 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. 43,255 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్ఛార్జి అయ్యారు.
![ఏపీలో కొత్తగా 7,813 కరోనా కేసులు.. 52 మంది మృతి.. 7813 new corona cases has reported in andhrapradesh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8170525-832-8170525-1595679246085.jpg)
ఏపీలో కొత్తగా 7,813 కరోనా కేసులు నమోదు