తెలంగాణ

telangana

ETV Bharat / state

78 ఏళ్ల వయస్సులో ఇంటర్​ పరీక్షలకు హాజరు - 78ఏళ్ల వయస్సులో ఇంటర్​ పరీక్షలకు హాజరు

పరీక్ష కేంద్రం వద్ద నిల్చున్న ఆయనను చూసి మనవరాలినో, మనవడినో దిగబెట్టడానికి వచ్చాడేమో అని అంతా అనుకున్నారు. తీరా ఆయన పరీక్ష హాల్లో ప్రత్యక్షమయ్యారు. అందరిలాగే పరీక్ష రాసేందుకు అట్ట, పెన్నులు తీసుకుని బుద్ధిగా తనకు కేటాయించిన సీటు వద్ద కూర్చుని రాసుకోవడం మొదలెట్టారు. 80 ఏళ్లకు చేరువలో పరీక్షకు కూర్చున్న ఈ పెద్దాయన కథేంటో మీరే చూడండి.

78ఏళ్ల వయస్సులో ఇంటర్​ పరీక్షలకు హాజరు
78ఏళ్ల వయస్సులో ఇంటర్​ పరీక్షలకు హాజరు

By

Published : Feb 22, 2020, 2:12 AM IST

Updated : Feb 22, 2020, 7:22 AM IST

ఏదైనా సాధించాలంటే దృఢ సంకల్పం, పట్టుదల ఉంటే చాలు.. వయస్సుతో పనిలేదు అని నిరూపించాడు ఆ పెద్దాయన. ఉత్తర్​ప్రదేశ్​లోని గోండా ప్రాంతం దూలమ్​పుర్​ నివాసి రామ్​కరణ్ ప్రజాపతి.. 78 ఏళ్ల వయస్సులో చదువు విలువను చాటి చెప్పారు. వృత్తిరీత్యా కుమ్మరి అయిన రామ్​కరణ్ ప్రస్తుతం ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరవుతున్నారు. ఇందులో భాగంగా గురువారం.. హిందీ పరీక్ష రాసేందుకు వచ్చారు.

78ఏళ్ల వయస్సులో ఇంటర్​ పరీక్షలకు హాజరు

1942 జులై 11న జన్మించిన రామ్​కరణ్ 1997లో ఎస్​ఎస్​సీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. ఆయనకు ఇద్దరు కుమారులు. అందులో ఒకరు సైకిల్​ పంచర్ షాప్ నిర్వహిస్తున్నారు. పేదరికంలో.. అదీ పెద్ద వయస్సులోనూ చదవాలన్న ఆయన పట్టుదలకు అందరూ ఫిదా అవుతున్నారు.

ఇదీ చూడండి:ఉత్తరప్రదేశ్​లో బయటపడ్డ టన్నులకొద్దీ పసిడి!

Last Updated : Feb 22, 2020, 7:22 AM IST

ABOUT THE AUTHOR

...view details