తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 7,738 కరోనా కేసులు - ap corona latest update

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 7,738 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 7,738 కరోనా కేసులు

By

Published : Sep 20, 2020, 6:19 PM IST

Updated : Sep 20, 2020, 7:28 PM IST

18:15 September 20

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 7,738 కరోనా కేసులు

ఏపీలో కొవిడ్‌ ఉద్ధృతి తగ్గటం లేదు. 24 గంటల వ్యవధిలో 70,455 కరోనా పరీక్షలు నిర్వహించగా....7,738 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. మరో 57 మంది ప్రాణాలు విడిచారు. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 6,25,514 మందికి వైరస్ సోకింది. 5,41,319 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకోగా...మరో 78,836 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మెుత్తం మృతుల సంఖ్య 5,359కు చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 51,04,131 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్యఆరోగ్యశాఖ హెల్త్​ బులిటెన్​లో వెల్లడించింది.  

జిల్లాల వారీగా కేసులు  

తూర్పుగోదావరి జిల్లాలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో జిల్లాలో 1,260 కరోనా కేసులు నిర్ధరణ అయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లా 1,005, ప్రకాశం 869, చిత్తూరు 794, గుంటూరు 582, అనంతపురం 539, శ్రీకాకుళం 476, నెల్లూరు 444, విజయనగరం 446, కృష్ణా 439, విశాఖ 342, కర్నూలు 275, కడప 267 కేసుల చొప్పున నమోదయ్యాయి.  

జిల్లాల వారీగా మరణాలు

కృష్ణా 8, అనంతపురం 7, చిత్తూరు 7, ప్రకాశం 6, విశాఖలో 6, తూర్పుగోదావరి 4, కర్నూలు 4, కడప 3, శ్రీకాకుళం 3, పశ్చిమగోదావరి 3, గుంటూరు 2, నెల్లూరు 2 చొప్పున మృతి చెందారు.

ఇదీ చదవండి:రేణూ దేశాయ్​ ఈజ్​ బ్యాక్​.. వెబ్​సిరీస్​కు గ్రీన్​సిగ్నల్​

Last Updated : Sep 20, 2020, 7:28 PM IST

ABOUT THE AUTHOR

...view details