ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 45,481 పరీక్షలు నిర్వహించగా.. 765 కేసులు నిర్ధారణ అయ్యాయి (covid cases in ap). తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 20,52,763 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఒక్కరోజు వ్యవధిలో కొవిడ్ బారినపడి 9 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు.
covid cases in ap: ఏపీలో కొత్తగా 765 కొవిడ్ కేసులు.. 9 మరణాలు - corona virus
ఏపీలో గడిచిన 24 గంటల్లో 45,481 పరీక్షలు నిర్వహించగా.. 765 కేసులు నిర్ధారణ అయ్యాయి(covid cases in ap). తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 20,52,763 మంది వైరస్ బారినపడినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
ap covid updates
దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 14,204కి చేరింది. 24 గంటల వ్యవధిలో 973 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,28,202కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 10,357 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,84,45,952 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.
ఇదీ చూడండి:గుడ్ న్యూస్.. ప్రపంచవ్యాప్తంగా తగ్గుతున్న కరోనా కేసులు