ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 76 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కొవిడ్ కేసుల సంఖ్య 3,118కి చేరింది. గడిచిన 24 గంటల్లో కర్నూలు జిల్లాలో ఇద్దరు మృతి చెందగా... 34 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
ఏపీలో కొత్తగా 76 కరోనా పాజిటివ్ కేసులు.. ఇద్దరు మృతి - కరోనా వైరస్ వార్తలు
ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. సోమవారం కొత్తగా 76 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో వైరస్ బాధితుల సంఖ్య 3,118కి చేరింది. గడిచిన 24 గంటల్లో ఇద్దరు మరణించారు. వారు కర్నూల్ జిల్లాకు చెందినట్లుగా గుర్తించారు.
కొత్తగా ఏపీలో 76 కరోనా పాజిటివ్ కేసులు
ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 885 మంది కొవిడ్ బాధితులు చికిత్స పొందుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసుల్లో 8 కోయంబేడు కాంటాక్ట్ కేసులు ఉన్నట్లు పేర్కొంది.
ఇవీ చూడండి:సోమవారం నుంచి మరో 200 ప్రత్యేక రైళ్లు