హైదరాబాద్ కొండాపూర్లోని సీఆర్ ఫౌండేషన్లో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఫౌండేషన్ కార్యదర్శి చెన్నమనేని వెంకటేశ్వరరావు ఉదయం 10గంటలకు త్రివర్ణ పతాకావిష్కరణ చేశారు. అనంతరం ఆశ్రమంలో నివాసం ఉంటున్న స్వాతంత్య్ర సమరయోధులు టీ. రామారావు, శాఖమూరి సుగుణ, రామిరెడ్డిలను ఆయన సన్మానించారు. కరోనా మహమ్మారి సమయంలో సమాజంలోని నిస్సహాయులకు విశేష సేవలందించిన డాక్టర్. కూనంనేని రజనీని వృద్ధాశ్రమ నివాసితులు సన్మానించారు.
Independence day: సీఆర్ ఫౌండేషన్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు - hyderabad news
హైదరాబాద్లోని సీఆర్ ఫౌండేషన్లో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సీఆర్ ఫౌండేషన్ కార్యదర్శి చెన్నమనేని వెంకటేశ్వర రావు జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా పలువురు స్వాతంత్ర్య సమరయోధులను ఫౌండేషన్ నిర్వాహకులు సత్కరించారు.
![Independence day: సీఆర్ ఫౌండేషన్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు CR FOUNDATION](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12780905-780-12780905-1629021111568.jpg)
సీఆర్ ఫౌండేషన్
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, ప్రముఖులు రూపొందించిన ప్రజాస్వామ్య సిద్ధాంతాలను కాపాడుకోవాలని ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ, సీఆర్ ఫౌండేషన్ కార్యదర్శి పీజే చంద్రశేఖర్ రావు అన్నారు. స్వాతంత్య్ర పోరాట యోధులను, వారి త్యాగాలను సుగుణ గుర్తు చేసుకున్నారు.
ఇదీ చదవండి:INDEPENDENCE DAY CELEBRATIONS: పార్టీ కార్యాలయాల్లో స్వాతంత్ర్య సంబురాలు