సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగిన 71వ ఎన్‌సీసీ డే వేడుకలు అలరించాయి. ఈ ఉత్సవాలకు దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీ కమాండెంట్ చలపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రమశిక్షణతో కూడుకున్న ఎన్‌సీసీ శిక్షణ కెడెట్లలో నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తుందని పేర్కొన్నారు. అంతకు ముందు కెడెట్లతో గౌరవవందనం స్వీకరించారు.
సాహసం... క్రమశిక్షణ... కలబోతే ఎన్‌సీసీ - 71th NCC Celebrations in Hyderabad
ఎన్‌సీసీ శిక్షణ శిబిరాల్లో కెడెట్స్కు ఇచ్చే శిక్షణ వారి జీవనగమనంలో ఎంతగానో ఉపయోగపడుతుందని దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీ కమాండెంట్, ఎయిర్ మార్షల్ చలపతి పేర్కొన్నారు. పరేడ్ మైదానంలో జరిగిన 71వ ఎన్‌సీసీ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

హైదరాబాద్లో 71వ ఎన్‌సీసీ డే వేడుకలు
ఈ సందర్భంగా దివ్యాంగుల కవాతు ఆకట్టుకుంది. యుద్ధ రంగంలో శత్రువులు చేసే బాంబుదాడులు, తూటాలకు నెరవకుండా శత్రువులను మట్టికరిపించే సన్నివేశాలను కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. గుర్రాల స్వారీ, సాహస సన్నివేశాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో ఔరా అనిపించారు.
హైదరాబాద్లో 71వ ఎన్‌సీసీ డే వేడుకలు
ఇదీ చూడండి : 'స్వార్థ ప్రయోజనాల కోసమే అయోధ్యపై రివ్యూ పిటిషన్