తెలంగాణ

telangana

ETV Bharat / state

Corona cases: రాష్ట్రంలో కొత్తగా 704 కరోనా కేసులు, ఐదుగురు మృతి - తెలంగాణలో కరోనా కేసులు

corona cases
కరోనా కేసులు

By

Published : Jul 10, 2021, 6:51 PM IST

18:29 July 10

Corona cases: రాష్ట్రంలో కొత్తగా 704 కరోనా కేసులు, ఐదుగురు మృతి

రాష్ట్రంలో కొత్తగా 704 కరోనా కేసులు నమోదయ్యాయి. శనివారం 1,00,632 కరోనా పరీక్షలు నిర్వహించారు. తెలంగాణలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసులు 6,31,218కు చేరాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు కేసుల సంఖ్య కాస్త తగ్గింది. 24 గంటల వ్యవధిలో ఐదుగురు బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,725కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 917 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 6,16,769కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 10,724 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అప్రమత్తమైన అధికారులు కాళేశ్వరాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు.  

ఇదీ చదవండి:KATHI MAHESH: నటుడు, సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌ మృతి

ABOUT THE AUTHOR

...view details