తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీ సీఎం జగన్‌ సభాస్థలి వద్ద అపశ్రుతి.. వృద్ధురాలికి తీవ్రగాయాలు - ap latest news

OLD WOMAN SERIOUSLY INJURED: ఆంధ్రప్రదేశ్​లో సీఎం జగన్​ సమావేశంకి వెళ్తుండగా వృద్దురాలకి గాయాలయ్యాయి. ఆమెను వెంటనే కాకినాడ జీజీహెచ్​కు తరలించారు.

OLD WOMAN SERIOUSLY INJURED
వృద్ధురాలికి తీవ్రగాయాలు

By

Published : Jan 3, 2023, 3:01 PM IST

వృద్ధురాలికి తీవ్రగాయాలు

OLD WOMAN SERIOUSLY INJURED : ఏపీ సీఎం జగన్‌ సభాస్థలి వద్ద అపశ్రుతి చోటుచేసుకుంది. సభ కోసం వచ్చి బస్సు దిగే క్రమంలో ఓ వృద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి. పింఛన్ల పెంపు వారోత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్​లోని రాజమహేంద్రవరంలో సీఎం బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ సభకు అర్జి పార్వతి (70) అనే వృద్ధురాలు వచ్చారు.

సభాస్థలి వద్ద దిగుతుండగా బస్సు కదలడంతో ఆమె కిందపడిపోయారు. దీంతో వృద్ధురాలి కాళ్ల పైనుంచి బస్సు టైర్లు వెళ్లాయి. ఈ ప్రమాదంలో పార్వతి తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను కాకినాడ జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details