క్యూనెట్‌లో ఇప్పటి వరకు 38 కేసులు నమోదు చేసి.. 70 మందిని అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. సినీ ప్రముఖులకూ నోటీసులు పంపించారు. అయితే తాము క్యూనెట్కు సంబంధించిన ప్రకటనల్లో నటించలేదని పేర్కొన్నారు. క్యూనెట్ అనుబంధ సంస్థ విహాన్ సెల్లింగ్ కార్యాలయాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు. క్యూనెట్ బాధితులు లక్షల్లో ఉన్నారన్నారని సీపీ చెప్పారు. దేశవ్యాప్తంగా దిల్లీ, మహారాష్ట్ర, బెంగళూరులో క్యూనెట్‌పై కేసులు నమోదైనట్లు సజ్జనార్ వివరించారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులే లక్ష్యంగా క్యూనెట్ కుంభకోణం జరిగిందన్నారు. మంచి అవకాశం పేరిట నిరుద్యోగులను మోసగించినట్లు పేర్కొన్నారు. క్యూనెట్ బాధితులు లక్షల్లో ఉన్నారని సీపీ వెల్లడించారు.
క్యూనెట్ కేసులో 70 మంది అరెస్ట్
క్యూనెట్ అనుబంధ సంస్థ విహాన్ డైరెక్ట్ సెల్లింగ్... గొలుసుకట్టు విధానం పేరుతో వేల కోట్ల రూపాయల మోసాలకు పాల్పడిందని సైబరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. ఈ కేసులో ఇప్పటికే 70మందిని అరెస్ట్ చేశామని..... దీనిపై కేంద్రం కూడా కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమైందని సజ్జనార్ తెలిపారు.
సజ్జనార్