తెలంగాణ

telangana

ETV Bharat / state

అలా వచ్చాడు... ఇలా కొట్టేశాడు...

పట్టపగలు అందరూ ఉండగానే రూ.70 లక్షలు ఎత్తుకెళ్లాడో దుండగుడు. 'పక్కనే నిల్చొని డబ్బులు పడిపోయాయి మీవేనేమో చూసుకోండి' అని చెప్పాడు. నిజమనుకున్న ఓ సెక్యూరిటీ గార్డు కిందకి చూశాడు. అంతే 70 లక్షల రూపాయలున్న నగదు పెట్టెను మాయం చేశాడు.

పట్టపగలే హైదరాబాద్​లో రూ. 70 లక్షల చోరీ

By

Published : May 7, 2019, 1:23 PM IST

Updated : May 7, 2019, 5:22 PM IST

అలా వచ్చాడు... ఇలా కొట్టేశాడు...

హైదరాబాద్ వనస్థలిపురంలోని పనామా కూడలి వద్ద భారీ దొంగతనం జరిగింది. సెక్యూరిటీ గార్డు దృష్టి మరల్చి రూ.70 లక్షల నగదు గల పెట్టెను అపహరించారు దుండగులు. పనామా కూడలి సమీపంలో ఉన్న యాక్సిస్ బ్యాంకు ఏటీఎంలో డబ్బులు పెట్టడానికి ఓ వాహనంలో సెక్యూరిటీ సిబ్బంది వచ్చారు. ఇద్దరు సిబ్బంది ఏటీఎంను తెరవడానికి వెళ్లగా... వాహనంలో ఉన్న నగదుకు సెక్యూరిటీగా ఒక గార్డును వదిలి వెళ్లారు. విషయం గమనిస్తున్న ఇందరు దొంగలు కావాలనే కింద డబ్బులు పడేశారు. పడిపోయిన డబ్బులు మీవేనా అంటూ సెక్యూరిటీ గార్డు దృష్టి మరల్చారు. కింద పడిపోయిన డబ్బులు తీసుకునేందుకు సెక్యూరిటీ గార్డు వంగగానే వాహనంలో ఉన్న నగదు పెట్టెను దుండగులు ఎత్తుకుని వెళ్లారు. మోసపోయానని గుర్తించిన గార్డు వెంటనే వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు. సమీపంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాలను పరిశీలిస్తున్నారు . ఈ ఘటనకు పాల్పడింది అంతరాష్ట్ర దొంగల ముఠాగా పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.

Last Updated : May 7, 2019, 5:22 PM IST

ABOUT THE AUTHOR

...view details