Covid cases in erragadda hospital: రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా హైదరాబాద్లోని ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో భారీగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 9 మంది వైద్య సిబ్బందితో పాటు 57 మంది రోగులకు వైరస్ సోకింది.
ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో కరోనా కలకలం.. 66 మందికి పాజిటివ్ - ఎర్రగడ్డ ఆస్పత్రిలో కరోనా కలకలం
17:10 January 17
ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో కరోనా కలకలం
తీవ్ర లక్షణాలు ఉన్న వారిని ఐసోలేషన్‌లో ఉంచినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉమాశంకర్ పేర్కొన్నారు. కొవిడ్ లక్షణాలు ఉన్నవారికి టెస్టులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మానసిక రోగులు కావడంతో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు డాక్టర్ ఉమాశంకర్ వివరించారు.
టెస్టులు పెంచాలన్న హైకోర్టు
రాష్ట్రంలో కొవిడ్ కేసుల తీవ్రత నేపథ్యంలో పరీక్షల సంఖ్య పెంచాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆర్టీపీసీఆర్ పరీక్షలు రోజుకు కనీసం లక్ష ఉండేలా నిర్వహించాలని స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తి నియంత్రణకు మరింత అప్రమత్తత అవసరమని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. భౌతిక దూరం, మాస్కులు ధరించడంతో పాటు.. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల్లోని నిబంధనలన్నీ కచ్చితంగా అమలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది.
ఇదీ చదవండి:TS High Court : రోజుకు లక్ష ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలి: హైకోర్టు