హైదరాబాద్లో కరోనా కేసులు ఏ మాత్రం తగ్గడం లేదు. ఆదివారం కూడా నగరంలో భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 659 మంది వైరస్ బారిన పడ్డారు. కూకట్‌పల్లి, మూసాపేట్ సర్కిల్లలో మొత్తం 9 కేసులు వచ్చాయని అధికారులు వెల్లడించారు. బోరబండలో 5, మూసాపేట్లో 3, కేపీహెచ్బీ కాలనీలో ఒకరికి వైరస్ సోకింది. వీరందరిని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంత రావుకు కరోనా నిర్ధరణయింది. జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. నగరంలోని పాతబస్తీ టపాఛబుత్ర పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సీఐతోపాటు.. ఎనిమిది మంది పోలీసులకు వైరస్ సోకింది. వీరిలో అత్యధికులు వాహన తనిఖీల విధుల్లో పాల్గొన్నట్లు తెలిసింది.