రాష్ట్రంలో కొత్తగా 6,551 కరోనా కేసులు.. 43 మంది మృతి - తెలంగాణలో కరోనా మరణాలు
09:14 April 26
కరోనాతో మరో 43 మంది మృతి
రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 6,551 మందికి పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. వైరస్ బారిన పడి ఒక్కరోజే అత్యధికంగా 43 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 65,597 క్రియాశీల కేసులు ఉన్నాయి. కరోనా నుంచి కోలుకొని మరో 3,804 మంది బాధితులు డిశ్చార్జి అయ్యారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,418 కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో యాంటీజెన్ కిట్‌ల కొరతతో టెస్టులు రోజురోజుకు తగ్గుతున్నాయి. 24 గంటల్లో కేవలం 73,275 మందికి మాత్రమే పరీక్షలు చేశారు. వీటిలో ప్రభుత్వాసుపత్రుల్లో కేవలం 58,626 మందికి మాత్రమే కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు.
ఇదీ చూడండి:కళ్ల ముందే కాటికి.. ఏమీ చేయలేని దీనస్థితి