రాష్ట్రంలో వే బిల్లులు లేకుండా సరుకు రవాణా చేస్తున్న 654 వాహనాలను సీజ్ చేసి రూ.3.60 కోట్లు మేర పన్నులను వసూలు చేసినట్లు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తెలిపారు. లాక్‌డౌన్ కారణంగా ఏప్రిల్, మే నెలల్లో వాహన తనిఖీలు పూర్తిగా లేకపోగా...లాక్‌డౌన్ సడలింపు తరువాత జూన్ నుంచి వాహన తనిఖీలు నిర్వహించినట్లు వివరించారు.
654 వాహనాలు సీజ్.. రూ.3.60 కోట్ల పన్ను వసూలు - వాణిజ్య పన్నుల శాఖ తాజా వార్తలు
రాష్ట్రంలో వే బిల్లులు లేకుండా సరుకు రవాణా చేస్తున్న 654 వాహనాలను వాణిజ్య పన్నుల శాఖ అధికారులు సీజ్ చేశారు. రూ.3.60 కోట్లు మేర పన్నులను వసూలు చేసినట్లు తెలిపారు. పన్ను ఎగవేతకు పాల్పడిన వారి నుంచి ట్యాక్స్ తోపాటు అపరాధ రుసుం వసూలు చేసినట్లు వివరించారు.
జూన్, జులై, ఆగస్టు నెలలతోపాటు ఈ నెల 15వ వరకు లక్షా 78 వేల 826 వాహనాలను తనిఖీలు చేసి...లక్షా 9వేల 312 వే బిల్లులను పరిశీలించాము. ఈ సందర్భంగా వే బిల్లులు లేకుండా సరుకులు రవాణా చేస్తున్న వాహనాలను, వే బిల్లులు ఉన్నప్పటికీ సరుకు మొత్తానికి కాకుండా తక్కువకు చూపించడం లాంటి అవకతవకలు ఉన్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. పన్ను ఎగవేతకు పాల్పడిన వారి నుంచి రూ.1.81 కోట్లు ట్యాక్స్, రూ.1.79 కోట్లు అపరాధ రుసుం వసూలు చేసినట్లు వివరించారు.
ఇదీ చూడండి:ఆస్తిపన్ను బకాయిల వన్‌టైమ్ సెటిల్మెంట్ గడువు పొడిగింపు