Corona cases: కొత్తగా 643 కరోనా కేసులు.. 4 మరణాలు - హైదరాబాద్ వార్తలు
రాష్ట్రంలో తాజాగా 643 మందికి కరోనా వైరస్ (corona) సోకినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు కొవిడ్ బారిన పడిన వారి సంఖ్య 6,40,012కి చేరింది. తాజాగా మహమ్మారితో నలుగురు మృతి చెందగా మొత్తం సంఖ్య 3,778కి పెరిగింది.
తెలంగాణలో కరోనా కేసులు
By
Published : Jul 23, 2021, 8:44 PM IST
తెలంగాణలో కరోనా కేసులు (CORONA CASES IN TELANGANA) క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,20,530 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 643 కొత్త కేసులు (corona cases) నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడి నలుగురు మరణించారు. ఇప్పటి వరకు నమోదైన కేసులతో కలిపి మొత్తం సంఖ్య 6,40,012 కి చేరింది.
మహమ్మారి బారి నుంచి మరో 767 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 6,26,505 మంది సురక్షితంగా బయటపడ్డారు. శుక్రవారం మరణించిన నలుగురితో కలిపి మొత్తం సంఖ్య 3,778కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 9,729 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తాజా కేసుల్లో అత్యధికంగా 77 కేసులు జీహెచ్‌ఎంసీలో నమోదయ్యాయి. జిల్లాల వారీగా వచ్చిన కేసులను పరిశీలిస్తే... ఇలా ఉన్నాయి.