రాష్ట్రంలో కొత్తగా 635 కరోనా కేసులు.. 4 మరణాలు - తెలంగాణలో కరోనా కేసులు
09:38 December 23
రాష్ట్రంలో కొత్తగా 635 కరోనా కేసులు.. 4 మరణాలు
రాష్ట్రంలో కొత్తగా 635 కరోనా కేసులు నమోదు అయ్యాయి. వైరస్ బారిన పడి మరో నలుగురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,82,982 కొవిడ్ కేసులను గుర్తించారు. కరోనాతో ఇప్పటివరకు 15,022 మంది మృతి చెందారు. కరోనా నుంచి మరో 573 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 2,74,833 మంది బాధితులు.. వైరస్ బారి నుంచి బయటపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6,627 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 4,467 మంది బాధితులు.. చికిత్స పొందుతున్నారు. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 115 కరోనా కేసులు నమోదు అయ్యాయి.