తెలంగాణ

telangana

ETV Bharat / state

TS CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 621 కరోనా కేసులు, 2 మరణాలు - telangana corona case bulletin

రాష్ట్రంలో కొత్తగా 621 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్​తో తాజాగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 691 మంది బాధితులు కొవిడ్​ నుంచి కోలుకున్నారు.

రాష్ట్రంలో కొత్తగా 621 కరోనా కేసులు, 2 మరణాలు
రాష్ట్రంలో కొత్తగా 621 కరోనా కేసులు, 2 మరణాలు

By

Published : Jul 31, 2021, 8:03 PM IST

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,13,012 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 621 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసులు 6,44,951కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది.

24 గంటల వ్యవధిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,802కు చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 691 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 6,32,080కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 9,069 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. వీరిలో కొందరు హోం ఐసోలేషన్​లో ఉండగా.. మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

జాగ్రత్తలు పాటించాలి..

18 ఏళ్లు నిండిన వారందరూ వ్యాక్సిన్​ తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. మొదటి డోసు తీసుకున్న వారు రెండో డోసు కూడా తప్పకుండా తీసుకోవాలని కోరుతున్నారు. మూడో వేవ్​ వచ్చే అవకాశం ఉండటంతో అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. లక్షణాలు ఉంటే తప్పకుండా కొవిడ్​ పరీక్ష చేయించుకోవాలని చెప్పారు.

ఇదీ చూడండి: MLC ELECTION: ఈ సమయంలో సాధ్యం కాదు.. ఈసీకి ప్రభుత్వం లేఖ

ABOUT THE AUTHOR

...view details