ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 6,045 కరోనా కేసులు నమోదు - ఆంధ్రప్రదేశ్ కరోనా వార్తలు
![ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 6,045 కరోనా కేసులు నమోదు 6,045 new corona cases has reported in andrapradesh today](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8129028-thumbnail-3x2-corona.jpg)
17:12 July 22
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 6,045 కరోనా కేసులు నమోదు
ఏపీలో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. బుధవారం కొత్తగా రికార్డు స్థాయిలో 6,045 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 64,713కు చేరింది. వైరస్‌తో మరో 65 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 823కి పెరిగింది.
కరోనాతో గుంటూరులో 15మంది మృతి చెందగా.. కృష్ణాలో 10 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 8 మంది మృతి చెందారు. తూర్పు గోదావరి జిల్లాలో ఏడుగురు, చిత్తూరులో ఐదుగురు కరోనాకు బలవ్వగా... కర్నూలులో ఐదుగురు, విజయనగరంలో నలుగురు మృతి చెందారు.
ఇదీ చదవండి:లేహ్ నుంచి దిల్లీకి ఆకాశమార్గాన అమృత ధారలు