వచ్చే ఏడాది 603 కోట్ల రూపాయల కంపా నిధులతో అటవీ భూముల స్థిరీకరణ, పునరుజ్జీవన చర్యలు, ప్రత్యామ్నాయ అడవుల పెంపకం చేపట్టే ప్రతిపాదనలను రాష్ట్ర కార్యనిర్వహక మండలి ఆమోదించింది. హైదరాబాద్ అరణ్యభవన్‌లో పీసీసీఎఫ్ శోభ అధ్యక్షతన కంపా రాష్ట్ర కార్యనిర్వాహక మండలి సమావేశం జరిగింది. అటవీ, ఆర్థిక, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ, గిరిజన సంక్షేమ శాఖల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
అడవుల కోసం రూ.603 కోట్ల కంపా నిధులు - 2014-15 నుంచి 2018 -19 మధ్య రాష్ట్రానికి 645 కోట్ల కంపా నిధుల కేటాయింపు
అటవీ భూముల స్థిరీకరణ, పునరుజ్జీవన చర్యల కోసం వచ్చే ఏడాది 603 కోట్ల రూపాయల కంపా నిధులను వాడే ప్రతిపాదనలను రాష్ట్ర కార్యనిర్వాహక మండలి ఆమోదించింది.
2014-15 నుంచి 2018 -19 మధ్య రాష్ట్రానికి రూ.645 కోట్ల కంపా నిధులను కేంద్రం కేటాయించగా... సుమారు 99 శాతానికి పైగా నిధులు వినియోగించినట్లు అదనపు పీసీసీఎఫ్ లోకేశ్ జైస్వాల్ వివరించారు. కంపా నిధులతో రాష్ట్ర అటవీ శాఖ చేపట్టిన ప్రత్యామ్నాయ అటవీకరణ, అడవుల పునరుద్దరణ, ఇతర పనులకు కేంద్రం నుంచి ప్రశంసలు దక్కాయని అన్నారు. పనులన్నింటినీ పూర్తి స్థాయిలో ఆడిట్ చేసి నివేదికలు అందిచడంలోనూ రాష్ట్రం ముందుందని చెప్పారు. కార్యనిర్వాహక మండలి ఆమోదంతో ప్రతిపాదనలను కేంద్రానికి పంపనున్నారు. సుమారు ఐదు వందల కోట్ల రూపాయల అంచనాతో ప్రస్తుత ఏడాది జరుగుతున్న పనుల పురోగతిని కూడా కమిటీ చర్చించి సంతృప్తి వ్యక్తం చేసింది.
TAGGED:
కంపా నిధులు కేటాయింపులు