రాష్ట్రంలో కొత్తగా 6,026 కరోనా కేసులు, 52మరణాలు - corona deaths in telangana
09:11 May 06
తెలంగాణలో కరోనా విజృంభణ
రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 6,026 కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైరస్ బారిన పడిన మరో 52 మంది మృతిచెందారని పేర్కొంది. కొవిడ్ నుంచి కొత్తగా 6,551 మంది బాధితులు కోలుకోగా... ప్రస్తుతం 77,127 క్రియాశీల కేసులు ఉన్నాయని తెలిపింది.
నిన్న ఒక్కరోజే 79,824 పరీక్షలు నిర్వహించగా... తాజాగా 6,026 కేసులు నిర్ధరణ అయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో మరో 1,115 మందికి పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. మేడ్చల్ జిల్లాలో 418, రంగారెడ్డి జిల్లాలో 403 కేసులు వెలుగుచూశాయి.
ఇదీ చూడండి:కరోనాతో ప్రముఖ సినీ ఎడిటర్ మృతి