కరోనా కట్టడికి అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. కామారెడ్డి జిల్లాలోని మహారాష్ట్ర సరిహద్దు వద్ద లారీలో వెళ్తున్న 60 మంది కూలీలను పోలీసులు అడ్డుకున్నారు. వీరంతా హైదరాబాద్ నుంచి రాజస్థాన్ వెళ్తున్నట్లు గుర్తించారు.
లారీలో వెళ్తోన్న కూలీలను అడ్డుకున్న పోలీసులు - kamareddy dist news
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సలబత్ పూర్ వద్ద లారీలో వెళ్తోన్న 60 మంది కూలీలను పోలీసులు అడ్డుకున్నారు. వీరంతా హైదరాబాద్ నుంచి రాజస్థాన్ వెళ్తున్నట్లు గుర్తించారు.
లారీలో వెళ్తోన్న కూలీలను అడ్డుకున్న పోలీసులు
వీరికి స్థానికులు అన్నం, నీళ్లు అందించారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు మండలంలోని మేనూర్ ఆదర్శ పాఠశాలకు తరలించి సౌకర్యాలు కల్పించారు.
ఇవీ చూడండి:వలస కార్మికుల కష్టాలు తీర్చేదెవరు..?