6 Months Baby Missing at Niloufer Hospital: నీలోఫర్ ఆస్పత్రిలో అపహరణకు గురైన బాలుడి కోసం పోలీసులు ఐదు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. నాంపల్లి పోలీసులతో పాటు.. టాస్క్ ఫోర్స్ పోలీసులు బృందాలుగా ఏర్పడి ఎంజీబీఎస్, ఆరాంఘర్తో పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో వెతుకుతున్నారు. ఆర్నెళ్ల చిన్నారి ఫైజల్‌ను గుర్తు తెలియని మహిళ గురువారం సాయంత్రం 7 గంటల సమయంలో నీలోఫర్ ఆస్పత్రి(Niloufer Hospital) నుంచి ఎత్తుకెళ్లింది. వివరాల్లోకి వెళితే..
Six Months Old Baby Missing From Niloufer Hospital : నీలోఫర్ ఆస్పత్రిలో ఆరు నెలల చిన్నారి అదృశ్యం
6 Months Baby Missing Case in Hyderabad :హైదాబాద్లోనిగండిపేట్లో ఓ ఫామ్ హౌజ్‌లో వాచ్‌మెన్‌గా పని చేస్తున్న సల్మాన్, ఫరీదా దంపతులకు ఇద్దరు కుమారులు. నాలుగేళ్ల వయసున్న పెద్ద కుమారుడు తీవ్ర జ్వరం రావడంతో నీలోఫర్ ఆస్పత్రికి గురువారం ఉదయం 11 గంటలకు తీసుకొచ్చారు. వైద్యులు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఫరీదా తన ఆర్నెళ్ల వయసున్న బాబుతో కలిసి వార్డు బయట కూర్చుంది. ఆ సమయంలో ఆమెతో ఓ మహిళ మాటలు కలిపింది. తాను ఇదే ఆస్పత్రిలో బాబును తీసుకొని చికిత్స కోసం వచ్చినట్లు నమ్మబలికింది.
ఫరీదా తన బాబును(Farida son Missing) వార్డు బయట ఉన్న హాలులో నిద్రపుచ్చి.. భోజనం తీసుకురావడానికి వెళ్లింది. 15 నిమిషాల తర్వాత తిరిగొచ్చే సరికి బాబు కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికింది. తనతో మాట్లాడిన మహిళ కూడా కనిపించకపోవడంతో.. ఆమే తన బాబుని ఎత్తుకెళ్లినట్లు నిర్ధారించుకుంది. దీంతో ఆసుపత్రి పక్కన ఉన్న పోలీస్ స్టేషన్లో తన బాలుడు అపహరణకు గురయ్యాడని ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వెంటనే నీలోఫర్ ఆస్పత్రిలోని వార్డుల్లో సీసీ కెమెరాలను పరిశీలించారు. వాటిలో కొన్నింటి ద్వారా సమాచారాన్ని సేకరించారు. ఆ పిల్లవాడు మిస్ అయిన వార్డు దగ్గరల్లో ఉన్న సీసీ కెమెరా పని చేయకపోవడంతో మహిళను గుర్తించడం కష్టంగా మారిందని నాంపల్లి సీఐ అభిలాశ్ తెలిపారు. గుర్తు తెలియని మహిళ కోసం పోలీసులు బృందాలుగా గాలిస్తున్నారు.