తెలంగాణ

telangana

ETV Bharat / state

బస్ భవన్​లో కరోనా కలకలం.. ఆరుగురికి పాజిటివ్ - బస్ భవన్ కరోనా వార్తలు

హైదరాబాద్‌లోని బస్‌ భవన్‌లో పని చేస్తున్న ఆరుగురు సిబ్బందికి కరోనా సోకింది. మిగతా సిబ్బందిలోనూ కలవరం మొదలైంది. కొవిడ్ పాజిటివ్ వచ్చిన బాధితులు నగరంలోని వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

bus bhavan
bus bhavan

By

Published : Jul 7, 2020, 7:41 PM IST

హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో కరోనా కలవరం రేపింది. బస్ భవన్ రెండో అంతస్తులోని ఐటీ, ఓపీటీ విభాగాల్లో పనిచేస్తున్న ఆరుగురు ఉన్నతాధికారులు, సిబ్బందికి కరోనా సోకింది. కొవిడ్ పాజిటివ్ వచ్చిన బాధితులు నగరంలోని వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారి కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్‌లో ఉంచినట్లు సమాచారం.

బస్ భవన్‌లోని నాలుగు అంతస్తుల్లో మొత్తం 400 మందికివపైగా పని చేస్తున్నారు. బస్‌ భవన్ సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో మిగతా సిబ్బందిలోనూ కలవరం మొదలైంది.

ఇదీ చదవండి :ఓఆర్​ఆర్​పై మంత్రి వాహనం బోల్తా.. ఒకరు దుర్మరణం

ABOUT THE AUTHOR

...view details