తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ ఉదయం స్వామివారు మోహినీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. క్షీరసాగర మధనంలో స్వామివారు మోహినిగా ఉద్భవించినట్టు భక్తుల ప్రతీతి.
తిరుమలలో మోహినీ అవతారంలో వేంకటేశ్వరుడు - tirumala Brahmotsavalu news
తిరుమలలో ఐదోరోజు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం మోహినీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు... మోహినీ అవతారంలో వేంకటేశ్వరుడు
అర్చకులు, జీయంగార్లు వేదమంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. కరోనా ప్రభావంతో ఉత్సవాలను ఆలయానికే పరిమితం చేయడంతో మాఢవీధుల్లో నిర్వహించాల్సిన కార్యక్రమాలన్నింటినీ ఆలయంలోనే చేశారు. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు గరుడసేవ నిర్వహిస్తారు.
ఇదీ చదవండి:ఆలయాల్లో వైభవుంగా శరన్నవరాత్రి ఉత్సవాలు..