తెలంగాణ

telangana

ETV Bharat / state

నెక్లెస్​రోడ్​లో ఆర్బీఐ ఉద్యోగుల 5కె రన్​ - ఆర్బీఐ తాజా వార్త

ఫైనాన్సియల్​ లిటరసీ వీక్​లో భాగంగా హైదరాబాద్​ నెక్లెస్​ రోడ్​లో ఆర్బీఐ 5కె రన్​ను చేపట్టింది. ప్రజలకు ఆర్బీఐ నియమ నింబధనలు వివరించే పలు కార్యక్రమాలను 'ఆర్థిక అక్షరాస్యత సప్తాహ' పేరిట దేశ వ్యాప్తంగా ఈ నెల 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు ఆర్బీఐ ఏపీ, తెలంగాణ రీజినల్ డైరెక్టర్ సుభ్రత దాస్ తెలిపారు.

5k run conducted by rbi at necklace road in hyderabad
నెక్లెస్​రోడ్​లో ఆర్బీఐ ఉద్యోగుల 5కె రన్​

By

Published : Feb 9, 2020, 12:34 PM IST

ఫైనాన్సియల్​ లిటరసీ వీక్​లో భాగంగా రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా హైదరాబాద్ నెక్లెస్ రోడ్​లో 5కె రన్​ను నిర్వహించింది. సంజీవయ్య పార్క్ నుంచి జలవిహార్ వరకు జరిగిన ఈ పరుగును ఆర్బీఐ ఏపీ, తెలంగాణ రీజినల్ డైరెక్టర్ సుభ్రత్​ దాస్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ పరుగులో ఆర్బీఐ ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

'ఆర్థిక అక్షరాస్యత సప్తాహ' పేరిట దేశ వ్యాప్తంగా ప్రజలకు ఈనెల 10 నుంచి 15వ తేదీ వరకు ఆర్బీఐ నియమ నిబంధనలను వివరించే పలు కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆర్బీఐ తెలంగాణ రీజినల్ డైరెక్టర్ తెలిపారు. సూక్ష్మ , మధ్యతరహా, చిన్న పరిశ్రమలపై ప్రత్యేక అవగాహనతో పాటు వివిధ రుణాల వంటి వాటిపై వారం రోజులపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు వివరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరు తమ వ్యక్తిగత ఖాతా వివరాలను ఎవరికి వెల్లడించకూడదని.. 10 రూపాయల నాణెం చెల్లదని వస్తోన్న వదంతులను నమ్మకూడదని సుభ్రత్​ దాస్​ సూచించారు.

నెక్లెస్​రోడ్​లో ఆర్బీఐ ఉద్యోగుల 5కె రన్​

ఇదీ చూడండి:మందుబాబు మస్కా.. భామ బడాయి

ABOUT THE AUTHOR

...view details