విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో విగిథాన్ పేరిట 5కే రన్ నిర్వహించారు. నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద పరుగును... యూబీఐ బ్యాంకు ఎఫ్‌జీఎం కబీర్ భట్టాచార్య ప్రారంభించారు. ప్రజా జీవితంలో సమగ్రత, పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించడానికి అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు భట్టాచార్య తెలిపారు.
5K RUN: ఉత్సాహంగా "విగిథాన్" 5కే రన్ - హైదరాబాద్ జిల్లా వార్తలు
విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద 5కే రన్ నిర్వహించారు. విగిథాన్ పేరిట ప్రారంభించిన ఈ 5కే పరుగును యూబీఐ ఎఫ్‌జీఎం కబీర్ భట్టాచార్య ప్రారంభించారు. పెద్ద ఎత్తున బ్యాంకు అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.
5K RUN
ఏటా సర్ధార్ వల్లబ్‌భాయ్‌పటేల్ జయంతిని పురస్కరించుకొని విజిలెన్స్ వారోత్సవాలు కొనసాగిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఈ సంవత్సరం 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అజాదీ కా అమృత్ మహోత్సవ కార్యక్రమాన్ని ఈ విధంగా చేస్తున్నట్టు భట్టాచార్య వివరించారు. 5కే పరుగులో పెద్ద ఎత్తున బ్యాంకు అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఇదీ చదవండి:CS On Harithaharam:గ్రేటర్‌లో మొక్కలు నాటే కార్యక్రమం వేగవంతం చేయాలి: సీఎస్