రాష్ట్రంలో మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని... షీ బృందాలు మహిళలకు అండగా నిలుస్తున్నాయని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. పోలీస్ శాఖలో భర్తీ చేస్తున్న పోస్టుల్లోనూ మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించామని తెలిపారు. మహిళల్లో భద్రతపై భరోసా కల్పించేందుకు షీబృందాల ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.
మహిళా భద్రతకు ప్రత్యేక చర్యలు: హోంమంత్రి - 5K and 2K run under ts She Teams at Charminar
హైదరాబాద్ చార్మినార్ వద్ద మహిళా దినోత్సవం సందర్భంగా షీ టీమ్స్ ఆధ్వర్యంలో 5కె, 2కె పరుగును నిర్వహించారు. జెండా ఊపి పరుగును హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. కార్యక్రమంలో డీజీపీ మహేందర్‌రెడ్డి, షీ టీమ్స్ ఇన్‌ఛార్జి స్వాతి లక్రా, సినీనటి అంజలి తదితరులు పాల్గొన్నారు.
ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ షీ టీమ్స్ ఆధ్వర్యంలో చార్మినార్ దగ్గర పరుగు నిర్వహించారు. 5 కిలోమీటర్లు, 2 కిలోమీటర్ల విభాగంలో నిర్వహించిన పరుగులో విద్యార్థులు, యువత, మహిళా కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. హోంమంత్రి మహమూద్ అలీ జెండా ఊపి పరుగును ప్రారంభించారు. నటి అంజలి ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విజేతలుగా నిలిచిన వాళ్లకు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ బహుమతులు ప్రదానం చేశారు.
ఇవీ చూడండి:ఏ పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం: ఈటల