రాష్ట్రంలో కొత్తగా 5,559 కరోనా కేసులు నిర్ధరణ అయ్యాయి. మరో 41 మంది ప్రాణాలు కోల్పోగా.. వైరస్ బారినుంచి మరో 8,061 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 71,308 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు సాయంత్రం ఐదున్నర గంటల వరకు వివరాలను ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. ఇవాళ్టి నుంచి రోజూ సాయంత్రం 6 గంటలకు కరోనా బులిటెన్ విడుదల చేస్తామని డీహెచ్ శ్రీనివాసరావు వెల్లడించారు.
జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 984 కేసులు వెలుగు చూశాయి. రంగారెడ్డి జిల్లాలో 457, మేడ్చల్ జిల్లాలో 372, వరంగల్ అర్బన్ జిల్లాలో 296 కేసులు నమోదయ్యాయి. నల్గొండ జిల్లాలో 208, కరీంనగర్ 201, ఖమ్మంలో 200 మందికి వైరస్ నిర్ధరణ అయింది.