రాష్ట్రంలో కొత్తగా 582 కరోనా కేసులు, 4 మరణాలు - తెలంగాణలో కరోనా మరణాలు
08:31 October 26
రాష్ట్రంలో కొత్తగా 582 కరోనా కేసులు, 4 మరణాలు
రాష్ట్రంలో కొత్తగా 582 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 2,31,834కు చేరింది. తాజాగా నలుగురు చనిపోగా.. మొత్తం మృతుల సంఖ్య 1,311కి చేరింది. కరోనా నుంచి మరో 1,432 మంది కోలుకోగా.. ఇప్పటివరకు కోలుకున్న మొత్తం బాధితుల సంఖ్య 2,11,912కి చేరింది.
తెలంగాణలో 18,611 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం హోం ఐసొలేషన్‌లో 15,582 మంది బాధితులు ఉన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 174 కరోనా కేసులు నమోదు కాగా... రంగారెడ్డి జిల్లాలో 55, నల్గొండ జిల్లాలో 87 కేసులు వెలుగు చూశాయి.