తెలంగాణ

telangana

ETV Bharat / state

58లక్షల మందిని స్వస్థలాలకు చేర్చాం: రైల్వేశాఖ - లాక్​డౌన్​ సమయంలో శ్రామిక్​ రైలు

లాక్​డౌన్​ సమయంలో రైల్వేశాఖ ఎనలేని కృషి చేసింది. ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన కార్మికులను స్వస్థలాలకు చేర్చేందుకు ప్రత్యేకంగా శ్రామిక్​ రైళ్లను నడిపించింది. దేశవ్యాప్తంగా 58లక్షల మంది ప్రయాణికులను స్వరాష్ట్రాలకు చేరవేసినట్లు రైల్వేశాఖ అధికారులు వెల్లడించారు.

58 LAKHS PASSENGERS TRANSPORT in SHRAMIK TRAINS in the Lock down time
58లక్షల మందిని స్వస్థలాలకు చేర్చాం: రైల్వేశాఖ

By

Published : Jun 3, 2020, 10:26 PM IST

లాక్‌డౌన్‌ కారణంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న 58 లక్షల మంది ప్రయాణికులను రైల్వేశాఖ స్వస్థలాలకు చేరవేసినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు 34 రోజుల్లో ప్రత్యేక శ్రామిక రైళ్ల ద్వారా దేశవ్యాప్తంగా చిక్కుకుపోయిన వలస కార్మికులు, పర్యాటకులు, విద్యార్థులను సొంత రాష్ట్రాలకు చేర్చినట్లు వెల్లడించారు.

ఇందు కోసం భారత రైల్వే ప్రత్యేకంగా 4197 శ్రామిక రైళ్లను నడిపినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. శ్రామిక రైళ్లతో పాటు 15 ప్రత్యేక రాజధాని రైళ్లను నడిపినట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా గరిష్ఠంగా ఐదు రాష్ట్రాలకు గుజరాత్‌ 1026, మహారాష్ట్ర 802, పంజాబ్‌ 416, ఉత్తరప్రదేశ్‌ 294, బీహార్‌ 294 చొప్పున శ్రామిక రైళ్లను నడిపినట్లు వెల్లడించింది.

ABOUT THE AUTHOR

...view details