తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీలో 572కు చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు

ఏపీలో కొత్తగా 38 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 572కు చేరాయి.

572-corona-positive-cases-in-the-ap state
ఏపీలో 572కు చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు

By

Published : Apr 17, 2020, 12:30 PM IST

ఆంధ్రప్రదేశ్​లో కొత్తగా 38 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 572కు చేరాయి. కర్నూలు జిల్లాలో కొత్తగా 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా... మొత్తం 126కు చేరాయి. గుంటూరు జిల్లాలో కొత్తగా 4 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... మొత్తం 126కు చేరాయి. నెల్లూరు జిల్లాలో కొత్తగా 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా... మొత్తం 64కు చేరాయి.

కృష్ణా జిల్లాలో కొత్తగా 4 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... మొత్తం కేసుల సంఖ్య 52కి చేరాయి. అనంతపురం జిల్లాలో కొత్తగా 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా... మొత్తం 26కు చేరాయి. చిత్తూరు జిల్లాలో కొత్తగా 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... మొత్తం కేసుల సంఖ్య 28కి చేరింది. కడప జిల్లాలో కొత్తగా 1 కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. కడప జిల్లాలో మొత్తం కేసులు 37కు చేరాయి.

ఇదీ చదవండీ...ఉపాధి కోల్పోయి సొంతూరి బాటలో వలస కార్మికులు

ABOUT THE AUTHOR

...view details