తెలంగాణలో గత 24 గంటల్లో 51,518 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 569 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 7,84,631కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.
CORONA CASES: రాష్ట్రంలో తగ్గుతోన్న కొవిడ్ ఉద్ధృతి.. కొత్త కేసులు ఎన్నంటే..? - కరోనా కేసులు
CORONA CASES: రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది. కొత్తగా 569 కేసులు నమోదవగా.. మరణాలు సంభవించలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో 8,379 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
CORONA CASES: రాష్ట్రంలో తగ్గుతోన్న కొవిడ్ ఉద్ధృతి.. కొత్త కేసులు ఎన్నంటే..?
తాజాగా కరోనాతో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం మృతుల సంఖ్య 4,107కి చేరింది. కరోనా బారి నుంచి కొత్తగా 2,098 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 8,379 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇదీ చూడండి: AP Corona Cases: ఏపీలో కొత్తగా 615 కరోనా కేసులు..