రాష్ట్రంలో కొత్తగా 51,562 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 565 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,70,883కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.
కొత్తగా 565 మందికి సోకిన కరోనా... మరొకరు మృతి - తెలంగాణలో కరోనా వార్తలు
రాష్ట్రంలో కొత్తగా నమోదైన 565 కేసులతో కలిపి... బాధితుల సంఖ్య 2,70,883కు చేరింది. కొత్తగా మరొకరు మృతి చెందగా... ఇప్పటి వరకు వైరస్ 1,462కి మంది చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9,266 యాక్టివ్ కేసులున్నాయి.

కొత్తగా 565 మందికి సోకిన కరోనా... మరొకరు మృతి
తాజాగా వైరస్‌తో ఒకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,462కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 925 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,60,155కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 9,266 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 7,219 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు తెలంగాణలో నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 55,51,620కి చేరింది.
ఇదీ చూడండి:పెళ్లిలో మాంసం పెట్టలేదని గొడ్డలితో హత్య