గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 54 మందికి కొవిడ్ సోకినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్త కేసులతో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ బారినపడ్డ వారి సంఖ్య 8,88,814కు చేరిందని వెల్లడించింది.
ఏపీలో ప్రస్తుతం 797 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కరోనా కారణంగా ఎవరూ మృతి చెందలేదని తెలిపిన వైద్యారోగ్యశాఖ.. మహమ్మారి కారణంగా ఇప్పటివరకు 7,162 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం ప్రకటించింది.