నిజాం కాలం నాటి హలీమ్ రుచులను హైదరాబాద్ ప్రజలకు అందించేందుకు మసాబ్ ట్యాంక్‌లోని త్రిబుల్ ఫైవ్ కేఫ్‌లో హలీమ్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వర్ధమాన సినీ నటి మన్నారా చోప్రా పాల్గొన్ని సందడి చేశారు. ఆమెతో పాటు పలు పలువురు మోడల్స్ పాల్గొన్నారు. వారితో కలిసి మన్నారా.. హలీమ్ రుచులను ఆస్వాదించారు.
నిజాం కాలం నాటి రుచితో హలీమ్.. తింటే మరికొంచెం అనాల్సిందే.! - haleem centre with nizam tasties
రంజాన్ అంటే అందరికీ గుర్తుకు వచ్చేది హాలీమ్. ఆ మాసంలో చిన్నాపెద్ద అందరూ హాలీమ్ రుచులను ఆస్వాదిస్తారు. ఈ నేపథ్యంలో నిజాం కాలం నాటి హలీమ్ రుచులను భాగ్యనగరవాసులకు అందించేందుకు త్రిబుల్ ఫైవ్ కేఫ్ సిద్ధం చేసింది. మసాబ్ ట్యాంక్‌లో దీనికి శ్రీకారం చుట్టింది.
![నిజాం కాలం నాటి రుచితో హలీమ్.. తింటే మరికొంచెం అనాల్సిందే.! haleem, 555 cafe](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11197559-743-11197559-1616982543174.jpg)
హలీమ్, మసాబ్ ట్యాంక్, త్రిబుల్ ఫైవ్ కేఫ్
తొలిసారిగా హలీమ్ రుచులను ఆస్వాదించడం చాలా సంతోషంగా ఉందని మన్నారా పేర్కొన్నారు. నిజాం కాలం నాటి హలీమ్‌ను తయారు చేస్తున్నామని వెజ్, నాన్ వెజ్లలో ఈ రుచులను అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఇదీ చదవండి:రంగుల హోలీ పండుగ విశిష్టత తెలుసుకుందామా.!