Electric Buses In TSRTC: ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించేందుకు.. పర్యావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని.. టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. వచ్చే నెలలోనే కొన్ని ఎలక్ట్రిక్ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని.. ఆర్టీసీ యాజమాన్యం కసరత్తులు చేస్తుంది. అందులో భాగంగా ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్ కు 550 ఎలక్ట్రిక్ బస్సుల కోసం.. ఆర్టీసీ ఆర్డర్ ఇచ్చింది. అందులో 500 బస్సులను హైదరాబాద్ సిటీలో.. మరో 50 బస్సులు విజయవాడ మార్గంలో తిప్పాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ కంపెనీకి చెందిన బస్సులతో పాటు జీబీఎం, అశోక్ లేలాండ్ కంపెనీల నుంచి మరో 1000 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకు వస్తారు. అయితే వీటిని గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ పద్ధతి ప్రకారం.. విడతల వారీగా ఆయా సంస్థలు టీఎస్‌ఆర్టీసీకి బస్సులను అందజేస్తాయి.
Telangana RTC Electric Buses:హైదరాబాద్‌లోని బస్‌భవన్ ప్రాంగణంలో నమూనా ఎలక్ట్రిక్ ఏసీ బస్సును టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పరిశీలించారు. బస్సులో ప్రయాణికులకు కల్పిస్తోన్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అధికారులకు సజ్జనార్ పలు సూచనలు చేశారు. బస్సుల్లో ప్రయాణికులకు అవసరమయ్యే సౌకర్యాల విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని.. ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్ ప్రతినిధులకు సూచనలు చేశారు. పర్యావరణహిత ఎలక్ట్రిక్ బస్సులకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందన్నారు.