ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి 51 ఇంజినీరింగ్, బీఫార్మసీ కళాశాలలు మూతపడనున్నాయి. మరో రెండు ఇంజినీరింగ్ కళాశాలలపై జేఎన్టీయూ-(కాకినాడ) తుది నిర్ణయం తీసుకోలేదు. కళాశాలల్లో మౌలికవసతులు, అనుమతుల పై అనంతపురం, కాకినాడ జేఎన్టీయూ పాలకవర్గాలు నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
తగ్గనున్న 1700 సీట్లు..
జేఎన్‌టీయూ-కాకినాడ పరిధిలో 26 ఇంజినీరింగ్, 2 బీఫార్మసీ కళాశాలలు ఈ ఏడాది మూతపడనున్నాయి. మరో రెండు కళాశాలలపై నిర్ణయం పెడింగ్‌లో ఉంది. నిబంధనలు పాటించని 45 ఇంజినీరింగ్ కాలేజీల్లో 4800 సీట్లు తగ్గించారు. మూతపడే కళాశాలలతో కలిపి.. కాకినాడ జేఎన్టీయూ పరిధిలో 12,600 సీట్ల వరకు తగ్గనున్నాయి. అనంతపురం-జేఎన్ట్టీయూ పరిధిలో.. 23 ఇంజినీరింగ్ కళాశాలలకు అనుమతులు నిలిపివేయనున్నారు. 17 కళాశాలల సీట్లలో కోత విధించారు. అనంతపురం-జేఎన్టీయూ పరిధిలో 41 వేల ఇంజినీరింగ్ సీట్లు ఉండగా.. ఈసారి 5,100 సీట్లు తగనున్నాయి. మొత్తం అన్ని కలిపి రాష్ట్రంలో ఈ ఏడాది 17,00 వరకూ సీట్లు తగనున్నాయి.
మరోవైపు ఈ ఏడాది బీఎస్సీ వ్యవసాయం, ఉద్యానం, వెటర్నరీ సైన్సు, మత్స్యకోర్సుల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకు అవసరమయ్యే సాంకేతిక సహకారం అందించాలని ఉన్నత విద్యామండలిని ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కోరింది.
ఇదీ చదవండి:అశ్రునయనాల మధ్య వీరజవాన్ మహేశ్ అంత్యక్రియలు