ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) దేశవ్యాప్తంగా 5,454 జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు..
* జూనియర్ అసోసియేట్(కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్)
* మొత్తం ఖాళీలు: 5454 (జనరల్-5000, ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ బ్యాక్‌లాగ్-121, పీడబ్ల్యూడీ-96, ఎక్స్ సర్వీస్‌మెన్-237)
* హైదరాబాద్ (తెలంగాణ): 275
అర్హత..
ఏదైనా విభాగంలో డిగ్రీ/ తత్సమాన ఉత్తీర్ణత. డిగ్రీ చివరి ఏడాది/ సెమిస్టర్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు..
01.04.2021 నాటికి 20-28 ఏళ్ల మధ్య ఉండాలి. 02.04.1993- 01.04.2001 మధ్య జన్మించి ఉండాలి.
ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం..
ఆన్‌లైన్ టెస్ట్ (ప్రిలిమినరీ & మెయిన్స్), లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
పరీక్షా విధానం..
ఆన్‌లైన్ ప్రిలిమినరీ టెస్ట్ 100 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. పరీక్షా సమయం 1 గంట ఉంటుంది. ఇందులో మూడు సెక్షన్లు ఉంటాయి. దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. పత్రి తప్పు సమాధానానికి 1/4 మార్కు కోత విధిస్తారు.
ప్రిలిమినరీ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా మెయిన్స్ పరీక్షకు ఎంపిక చేస్తారు. దీనిలో నాలుగు సెక్షన్లు ఉంటాయి. ఈ పరీక్షను మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నల సంఖ్య 190, పరీక్షా సమయం 2 గంటల 40 నిమిషాలు ఉంటుంది.
రీజనింగ్ ఎబిలిట్ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 50 ప్రశ్నలు 60 మార్కులు 45 నిమిషాలు
దరఖాస్తు విధానం…
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు..
ఇతరులు రూ.750 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27.04.2021
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 17.05.2021
ప్రిలిమినరీ పరీక్ష: 2021 జూన్
మెయిన్స్ పరీక్ష తేదీ: 31.07.2021