హవాలా మార్గం ద్వారా తరలిస్తున్న రూ.50 లక్షలు ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నల్లకుంటకు చెందిన అవినాశ్ వృత్తిరిత్యా స్థిరాస్తి వ్యాపారి. హైదరాబాద్‌తోపాటు తమిళనాడులోని కోయంబత్తూర్‌లో వ్యాపారం చేస్తున్నాడు.
50 లక్షల హవాలా నగదు పట్టుబడింది - Hyderabad police seized Rs 50 lakh hawala money
ఎల్బీ స్టేడియం సమీపంలో హవాలా మార్గం ద్వారా తరలిస్తున్నరూ. 50 లక్షలు ఉత్తర మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. సరైన పత్రాలు లేని కారణంగా ఆ నగదును సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు.
50 లక్షల హవాలా నగదు పట్టుబడింది
పెట్టుబడుల కోసం శ్రీకాళహస్తిలోని తన స్నేహితుడి నుంచి హవాలా మార్గం ద్వారా 50 లక్షలు మోజంజాహి మార్కెట్ వద్ద తీసుకున్నాడు. నగదును కారులో ఉంచుకుని వెళ్తుండగా... తమకు వచ్చిన సమాచారం మేరకు ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఎల్బీ స్టేడియం సమీపంలో తనిఖీలు చేసి అవినాశ్‌ను ఆపారు. కారులో ఉన్న నగదుకు సరైన పత్రాలు చూపించకపోవడం వల్ల డబ్బును స్వాధీనం చేసుకుని సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు.
ఇదీ చూడండి :దంత వైద్యుడి అపహరణ కేసులో ఏడుగురు అరెస్ట్