తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో 6,526కు చేరిన కరోనా కేసులు

కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. ముఖ్యంగా భాగ్యనగరంలో చాపకింద నీరులా వేగంగా విస్తరిస్తోంది. శుక్రవారం రికార్డు స్థాయిలో 499 మందికి కరోనా నిర్ధరణయింది. మొత్తం కేసుల సంఖ్య 6526కు పెరిగింది. కేసుల పెరుగుదల అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 50,569 పరీక్షలు చేశారు.

499 new corona cases has reported in telangana on friday
రాష్ట్రంలో 6,526కు చేరిన కరోనా కేసులు

By

Published : Jun 20, 2020, 4:15 AM IST

Updated : Jun 20, 2020, 9:40 AM IST

రాష్ట్రంపై కరోనా విరుచుకుపడుతోంది. గత నాలుగు రోజులుగా దాదాపు 7 వేల మందికి కరోనా పరీక్షలు చేయగా అందులో 1,333 మందికి నిర్ధరణయింది. ఇప్పటి వరకు 6,526 మందికి కారోనా నిర్ధరణ కాగా.. అందులో 1333 మందికి ఈ నెల 16 నుంచి 19 మధ్య.. అంటే నాలుగు రోజుల్లో వైరస్​ సోకింది. అందులో 1010 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే.

రాష్ట్రంలో తక్కువ టెస్టులు చేస్తున్న కారణంగానే తక్కువ కేసులు నమోదవుతున్నాయన్న ఆరోపణలతో ప్రభుత్వం పరీక్షల సంఖ్య పెంచింది. జీహెచ్ఎంసీ, దాని పరిసర ప్రాంతాల్లో పది రోజుల్లో 50 వేల టెస్టులు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ భావించింది. ఇందులో భాగంగా గత నాలుగు రోజులుగా జీహెచ్ఎంసీ సహా చుట్టుపక్కల జిల్లాల్లో కారోనా నిర్ధరణ పరీక్షలను వేగవంతం చేసింది.

రాష్ట్రంలో 50,569 పరీక్షలు

రాష్ట్రంలో 50,569 పరీక్షలు నిర్వహించారు. శుక్రవారం నమోదైన 499 కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 329 కాగా... రంగారెడ్డిలో మరో 129 వెలుగు చూశాయి. ఇప్పటి వరకు 3,352 మంది ఇప్పటికే డిశ్చార్జి కాగా.. 198 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,976 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. మృతి చెందిన వారిలో అత్యధికంగా 50 నుంచి 60 ఏళ్ల మధ్య వారు 52 మంది ఉన్నారు. 61 నుంచి 70 ఏళ్ల వారు 48 మంది, 41 నుంచి 50 ఏళ్ల వారు 42 మంది 71 నుంచి 80 ఏళ్ల వారు 26 మంది ఉన్నారు. ఏడాదిలోపు వయసున్న 4 చిన్నారులు మహమ్మారికి బలయ్యారు.

18 ప్రైవేట్ ల్యాబ్​లకు అనుమతి

ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న 10 ల్యాబ్​లతో పాటు.. మరో 18 ప్రైవేట్ ల్యాబ్​లకు పరీక్షలు చేసేందుకు సర్కార్​ అనుమతి ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ రోగులకు చికిత్స అందించేందుకు ప్రభుత్వం 34 ఆస్పత్రులను గుర్తించగా...అందులో మొత్తం 17,081 పడకలు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో ఇప్పటికే 976 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయం పడుతున్నారు. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచిస్తున్నారు.

ఇదీ చూడండి:యుద్ధ వ్యూహాలతో శత్రు దేశాలను ఎదుర్కొందాం : సీఎం కేసీఆర్‌

Last Updated : Jun 20, 2020, 9:40 AM IST

ABOUT THE AUTHOR

...view details