రాష్ట్రంలో గత 24గంటల్లో 89,675 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 453 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,51,288కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. నిన్న కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 3,836కి చేరింది.
కరోనాబారి నుంచి మరో 591 మంది కోలుకోగా.. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,39,456కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 8,137 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 69 కేసులు నమోదయ్యాయి.