తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్​: దక్షిణ మధ్య రైల్వేలో 45 రైళ్లు రద్దు - corona effect on railway

కరోనా ప్రభావం రైల్వేశాఖపై పడింది. వైరస్​ సోకుతుందనే భయంతో అత్యధిక శాతం ప్రజలు ప్రయాణాలు రద్దుచేసుకుంటున్నారు. ఈనెల 20 నుంచి 31 వరకు ఏకంగా 45 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దుచేసింది.

45 trains cancelled in scr region due to corona effect
కరోనా ఎఫెక్ట్​: దక్షిణ మధ్య రైల్వేలో 45 రైళ్లు రద్దు

By

Published : Mar 20, 2020, 6:08 AM IST

Updated : Mar 20, 2020, 9:08 AM IST

కరోనా ప్రభావం రైల్వేశాఖపై పడింది. వైరస్​ ప్రభావంతో అత్యధికశాతం ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారు. ఫలితంగా రైల్వే ప్రయాణికుల సంఖ్య చాలా వరకు తగ్గిపోయింది. దేశవ్యాప్తంగా 155 రైళ్లను రద్దుచేశారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 45 రైళ్లలో ఆక్యుపెన్సీ వల్ల రద్దు చేసినట్లు రైల్వేశాఖ పేర్కొంది. ఈనెల 20 నుంచి 31 వరకు వివిధ రైళ్లను రద్దుచేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రద్దైన రైళ్ల వివరాలు...

  • తిరుపతి- కెఎస్​ఆర్​ బెంగళూరు (ఎగువ, దిగువ)
  • యశ్వంత్​పూర్- కాచిగూడ (ఎగువ, దిగువ)
  • ముంబయి ఎల్​టీటీ- అజ్నీ (ఎగువ, దిగువ),
  • ముంబాయి ఎల్​టీటీ- కరీంనగర్ (ఎగువ, దిగువ)
  • ముంబాయి సీఎస్టీ- నాగపూర్ (ఎగువ, దిగువ)
  • కాలబుర్గి (గుల్బర్గ)- హైదరాబాద్ (ఎగువ, దిగువ)
  • చెన్నై- సికింద్రాబాద్​ (ఎగువ, దిగువ)
  • సంత్రగచ్చి- చెన్నై (ఎగువ, దిగువ)
  • కాకినాడ టౌన్​- లింగంపల్లి( ఎగువ, దిగువ)
  • మచిలీపట్నం-సికింద్రాబాద్ (ఎగువ, దిగువ)
  • హైదరాబాద్- ఎర్నాకుళం (ఎగువ, దిగువ)
  • హైదరాబాద్- విజయవాడ
  • తిరుచురాపల్లి- హైదరాబాద్ (ఎగువ, దిగువ)
  • హెచ్​ఎస్ నాందేడ్- ఔరంగాబాద్ (ఎగువ, దిగువ)
  • ఔరంగాబాద్-రేణిగుంట (ఎగువ, దిగువ)
  • తిరుపతి- చెన్నై సెంట్రల్ (ఎగువ, దిగువ)
  • కాన్పూర్ సెంట్రల్- కాచిగూడ (ఎగువ, దిగువ) రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.

ఏసీ రైళ్లలో రిజర్వేషన్ చేసుకున్న వారూ టికెట్లను రద్దు చేసుకుంటున్నారు. మూడంకెల్లో ఉన్న రిజర్వేషన్లు రెండంకెలకు పడిపోయాయి. ఇప్పటికే ఏసీ రైళ్లలో దుప్పట్ల పంపిణీ నిలిపేశామని.. కనీస ఉష్ణోగ్రత కొనసాగిస్తున్నామని అధికారులు తెలిపారు. రైళ్లు, రైళ్ల లోపల ప్రాంతాలు, స్టేషన్లను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్​లో థర్మల్​ స్క్రీన్​లను ఏర్పాటు చేసి పరీక్షిస్తున్నారు.

రాయితీలు రద్దు

రైళ్లలో వివిధ వర్గాలవారి రాయితీలను తాత్కాలికంగా నిలిపివేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అనవసర ప్రయాణాలను కట్టడి చేయడానికి శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి.. తిరిగి ప్రకటించే వరకు రాయితీలు ఉండబోవని స్పష్టం చేసింది. 53 రకాల రాయితీల్లో మొత్తంగా 15 రకాలను మాత్రమే ఇప్పుడు వాడుకునే వీలుంటుందని స్పష్టం చేసింది. 20వ తేదీ లోపు టికెట్లు తీసుకున్నవారు వాటిని రద్దు చేసుకుంటే టికెట్‌ రద్దు రుసుమును వసూలు చేయరు. రాయితీతో ముందే తీసుకున్న టికెట్‌పై ప్రయాణం చేస్తే మిగిలిన ఛార్జీని వసూలు చేయరు. విద్యార్థులు, దివ్యాంగుల్లో కలిపి నాలుగు విభాగాల వారికి, మరో 11 రకాల రోగులకు మాత్రం రాయితీలు కొనసాగుతాయని రైల్వేశాఖ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

ఇవీచూడండి: కరోనాతో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తం

Last Updated : Mar 20, 2020, 9:08 AM IST

ABOUT THE AUTHOR

...view details