గ్రేటర్ పరిధిలో గురువారం 45 బస్తీ దవాఖానాలు ప్రారంభంకానున్నాయి. హైదరాబాద్ జిల్లాలో 22, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 15, రంగారెడ్డి జిల్లాలో 05, సంగారెడ్డి జిల్లాలో 3 బస్తీ దవాఖానాలను నూతనంగా ఏర్పాటు చేశారు. వీటన్నింటినీ మంత్రులు ప్రారంభించునున్నారు. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో 123 బస్తీ దవాఖానాలు ప్రతిరోజూ 10 వేల మందికి వైద్య సేవలు అందిస్తున్నారు. నూతనంగా ప్రారంభించే 45 బస్తీ దవాఖానాలతో అదనంగా 4 వేల మందికి వైద్య సేవలు అందనున్నాయి. ఒక్కో బస్తీ దవాఖానాలో వైద్యుడు, నర్స్, సహాయకుడు ఉంటారు. నూతనంగా 45 బస్తీ దావఖానాల ప్రారంభం కోసం నోడల్ అధికారులను జీహెచ్ఎంసీ కమిషనర్ నియమించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు.
గ్రేటర్ పరిధిలో ప్రారంభంకానున్న 45 బస్తీ దవాఖానాలు - హైదరాబాద్లో 45 బస్తీ దవాఖానాలు ప్రారంభం
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బస్తీవాసులకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో నెలకొల్పిన బస్తీ దవాఖానాలు గురువారం ప్రారంభం కానున్నాయి. గ్రేటర్ పరిధిలో నూతనంగా నిర్మించిన 45 బస్తీ దవాఖానాలను మంత్రులు ప్రారంభించనున్నారు.
![గ్రేటర్ పరిధిలో ప్రారంభంకానున్న 45 బస్తీ దవాఖానాలు 45 Basthi dawakanas in hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7291491-thumbnail-3x2-basthi-rk.jpg)
గ్రేటర్ పరిధిలో ప్రారంభంకానున్న 45 బస్తీ దవాఖానాలు
గ్రేటర్ పరిధిలో ప్రారంభంకానున్న 45 బస్తీ దవాఖానాలు